
గులాబీ గూటికి పుట్ట మధు
మంథని, న్యూస్‌లైన్ : మంథని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో సోమవారం గులాబీ కండువా కప్పుకున్నారు. మధుతోపాటు ఆయన సతీమణి మంథని సర్పం చ్ శైలజ, ఆయన అనుచరులకు కేసీఆర్, కేకేలు కండువా కప్పి సా దరంగా ఆహ్వానించారు.
ఆరు నెలలుగా స్తబ్ధుగా ఉన్న పుట్ట మధు బీజేపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరిగిం ది. అనూహ్యంగా ఐదు రోజుల క్రితం మధు కేసీఆర్‌తో మంతనాలు జరుపగా, ఆనాడే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఖరారైంది.
గత ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై ప్రజారాజ్యం తరఫున మధు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీఆర్‌ఎస్ తరపున మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం మంథనికి వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.