ధర్నాలు నిషేధించడం నియంతృత్వం
సీపీఐ నేత నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ధర్నాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఇందిరా పార్కు వద్ద ధర్నాలను నిషేధించడం ద్వారా తన నియంతృతత్వాన్ని ప్రదర్శించుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లా డుతూ.. ఉద్యమాలు చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే వారిని అణచాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ సాయిబాబా జీవితఖైదును పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓయూ అభివృద్ధికి నిధులివ్వండి:శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో మౌలికసదుపాయాలకై రూ.500 కోట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేర్‌ను ఏఐఎస్‌ఎఫ్ నేతలు కోరారు. ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో నాయకులు స్టాలిన్, వలీఉల్లా ఖాద్రీ ఆసిఫ్ తదితరులు కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.