తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ ఉన్నారు. భేటీలో విద్యాశాఖ పరంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి రాష్ట్రపతి ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బాలికా విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టామని కడియం చెప్పారు. దాదాపు 470 గురుకుల పాఠశాలు, 53 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో బాలికా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బాలికా విద్యపై దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో, కాళాశాలల్లో బాలికల ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని రాష్ట్రపతి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment