సాక్షి, ఖమ్మం(పాల్వంచ) : టీఎస్ జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావుపై కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్‌లో టీఎస్ పీఈజెఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఇంజనీర్లు, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎండీకి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణాను మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా నిలబెట్టడంతో సీఎండీ కృషి చేశారని అన్నారు. కానీ..రేవంత్ రెడ్డి సీఎండీ ముడుపులు తీసుకున్నారని వ్యాఖ్య చేయడం సరికాదని తెలిపారు.
కార్యక్రమంలో పీఈఏ నాయకులు పీవీ.రావు, ఉమామహేశ్వరరావు, టీవీఈఏ నాయకులు ఎన్.భాస్కర్, ఎస్.సుధీర్, పి.ప్రతాప్, టీఈఈఏ నాయకులు పి.షమీర్, సీహెచ్.శ్రీనివాసరావు, టీఎస్ పీడీఈఏ నాయకులు ఎన్.అశోక్ కుమార్, వైవీ.రావు, టీఆర్‌వీకేఎస్ నాయకులు కట్టా మల్లికార్జున్‌రావు, 1104 నాయకులు పి.సుధీర్, కోటేశ్వరరావు, 1535 రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ.వజీర్, 327 నాయకులు మాజీద్, బీఎంఎస్ నాయకులు జి.వేణుగోపాల్, ఓసీ ఎంప్లాయిస్ నాయకులు పి.కోటేశ్వరరావు, కె.రవీందర్, సందుపట్ల శ్రీనివాస రెడ్డి, ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు పి.రాజేశ్వరరావు, అకౌంట్స్, స్టాఫ్ నాయకులు సీహెచ్.శ్రీనివాస రెడ్డి, హెచ్ 142 నాయకులు కెవి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్‌లో..
నిరసన కార్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీవైసీసీఏ.సోని రావు, ఎస్‌ఏఓ హరిత, సార, రంగాచారి, చెరుకు అశోక్, ఎండీ.సాధిక్, రెడ్డిరాజుల రమేష్, గుండా సాంబశివరావు, ప్రకాష్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment