
వికలాంగులకు రూ.1500 ఫించన్: పోచారం
నిజామాబాద్: దసరా నుంచి వితంతువులు, వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వికలాంగులకు రూ.1500 ఫించన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ బడుగు వర్గాల ఆడపిల్లల వివాహానికి రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం దసరా నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
రైతులకు రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని అంతకుముందు పోచారం వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులను ఒప్పించే యత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు.