
గేటుకు తాళం వేసి లాక్‌డౌన్ అని ఏర్పాటు చేసిన బోర్డు
సాక్షి, నిర్మల్: కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించింది. అయితే చాలామంది ప్రజలు దీనిని పట్టించుకోకుండా ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ నిర్మల్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి డి.వి.రమణాచారి అసలు తన ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా ఇంటికి తాళం వేసుకొని ‘గర్ లాక్’ డౌన్ పాటిస్తున్నారు. 21 రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతను అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.