బస్సు‌ను ఢీకొన్న బైకు: ఒకరికి గాయాలు | man injures of rtc bus accident in mahaboob nagar district | Sakshi
Sakshi News home page

బస్సు‌ను ఢీకొన్న బైకు: ఒకరికి గాయాలు

Published Sat, Jun 13 2015 6:10 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

man injures of rtc bus accident in mahaboob nagar district

బిజినేపల్లి (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గాంధీ చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. నాగర్‌కర్నూల్ నుంచి బిజినేపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక బైకుపై వస్తున్న పుల్జాల సాయిశివప్రసాద్ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో పాటు ఎడమచేయి విరిగింది. వెంటనే అతణ్ని 108 అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి, అనంతరం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి, బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement