‘పేపరుకు ఐదువేల రూపాయలు ఇవ్వండి...ఇంటర్ పరీక్షల్లో మార్కులు సంపాదించుకోండి....’అంటూ కొందరు పక్కాగా ప్లాన్‌చేసి కాపీయింగ్‌కు తెరలేపారు.
‘పేపరుకు ఐదువేల రూపాయలు ఇవ్వండి...ఇంటర్ పరీక్షల్లో మార్కులు సంపాదించుకోండి....’అంటూ కొందరు పక్కాగా ప్లాన్‌చేసి కాపీయింగ్‌కు తెరలేపారు. అక్ర‘మార్కులకు’ అడిగినంతా ముట్టచెబితే అంతా వారే చూసుకుంటారు. పరీక్ష హాలు నుంచి ప్రశ్నలు బయటకు రప్పించడం, జవాబులు రాయించడం, వాటిని విద్యార్థికి చేరేలా చూడడం...అంతా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుని, అందరినీ మేనేజ్ చేస్తున్నారు.
ఓప్రైవేట్ లెక్చరర్ సూత్రధారిగా నడుస్తున్న ఈతతంగానికి రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ...జిల్లా కేంద్రం ఖమ్మంలో రెండుకళాశాలల్లో జరుగుతున్న ఈ కాపీయింగ్‌పై సమాచారం అందడంతో సాక్షి-సాక్షి టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఈనిజాలు వెల్లడయ్యాయి.