సాక్షి,సిటీబ్యూరో: మరో రెండో రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ కొత్తగా ఓటర్లకు గుర్తింపు కార్డు మాత్రం ఇంకా అందలేదు. దీంతో తమ ఓటు ఉందో లేదో తెలియక.. తమకు ఓటు వేసే అవకాశం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు మీ–సేవలో ఆరా తీయగా సర్వర్లు పనిచేయడం లేదని, ఎపిక్ నెంబర్ తెలిస్తే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో ఆయా మీ–సేవా సెంటర్ల వద్ద కాపు కాస్తున్న బోక్రర్లు సిబ్బందితో కుమ్మకై కార్డుకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. మీ–సేవలో కార్డుకు అధిక డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘కార్డుకు రూ.25 మించి చెల్లించవద్దని, కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషన్ ఉచితంగా కార్డులు అందచేస్తుంద’ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు.
అందని సప్లిమెంట్ కార్డులు
ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఇంకా దాదాపు హైదరాబాద్ జిల్లాలో రెండోసారి దరఖాస్తు చేసుకున్నవారికి సప్లిమెంట్ ఓటరు కార్డులు అందలేదు. ‘సాక్షి’ ప్రతినిధి పలు ఈఆర్‌ఓలతో సంప్రదించగా.. ప్రధాన కార్యాలయలం నుంచి కార్డులు అందలేదన్నారు. ఓటుపై పెరిగిన చైతన్యం కల్పిస్తూ అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి అక్టోబర్ 12వ తేదీ విడుదల చేసిన జాబితాలో ఓట్లు వచ్చాయి. అయితే ఈ లిస్ట్‌లో ఓట్లు వచ్చిన వారికి గుర్తింపు కార్డులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం నవంబర్ 9 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఓటు నమోదైనవారికి మాత్రం కార్డులు ఇవ్వలేదు.
పనిచేయని సర్వర్..
ఎన్నికల నిర్వహణ అధికారులు ఎదైనా గుర్తింపు కార్డు తీసుకొచ్చినా ఓటు వేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ముందు ఓటరు జాబితాలో పేరుందో, లేదో ఎలా తెలుస్తుందనేది నగరవాసి ప్రశ్న. ఇంటర్‌నెట్‌లో చూసుకుందామనకున్నా, మీ సేవకు వెళ్లినా సర్వర్ సర్వర్ పనిచేయడం లేదనే సమాధానం వస్తుంది. అసలు ఓటు నమోదు అయిందా లేదా రద్దుఅయిందా తెలియాలి కాదా.
Comments
Please login to add a commentAdd a comment