కేసీఆర్ పై నమోదైన కేసులపై ఏపీ 'సిట్'
హైదరాబాద్: ఏపీ నాయకుల ఫోన్లు టాపింగ్ చేయారంటూ అక్కడి ప్రజాప్రతినిధులు ఆరోపించడంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్ 1999 క్యాడర్కు చెందిన అధికారి మహ్మద్ ఇక్బాల్ను సిట్ అధిపతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన రాయలసీమలోని కడప జిల్లాకు చెందినవారు.
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై ఏపీలో నమోదైన 87 కేసులపై విచారణ చేపట్టాలని ఆయనను ఏపీ సర్కారు ఆదేశించింది. మహ్మద్ ఇక్బాల్ గతంలో మైనార్టీ వర్గాల సంక్షేమ శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడీ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారిగా, డీఐజీ రేంజ్ ఆఫీసర్గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు ఆయనకు చీఫ్ సెక్యురిటీ అధికారిగా, డీఐజీగా ప్రమోషన్ వచ్చేవరకు ఆయన మెదక్ జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.