ఎంపీటీసీ టూ ఎమ్మెల్యే
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : రాజకీయాల్లో ప్రవేశించగానే పదవిని అలంకరించే అవకాశం ఏ కొందరికో సాధ్యం. అలాంటి అరుదైన అదృష్టాన్ని సొంతం చేసుకున్న వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే ఒకరు. నార్కట్‌పల్లి మండ లం బి.వెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి లింగయ్య రైతు కుటుం బంలో జన్మించారు.
టీడీపీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసిన కొద్ది కాలంలోనే గ్రామం నుంచి టీడీపీ ఎంపీటీసీగా గెలిచి 1995 నుంచి 2000 వరకు కొనసాగారు. ఎంపీటీసీగా కొనసాగే సమయంలో కోమటిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో నార్కట్‌పల్లి మండలం జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొంది 2001 నుంచి 2006 వరకు కొనసాగారు. నియోజకవర్గాల పునర్‌విభజన నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయ్యింది. దీంతో 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మిత్ర పక్షాల అభ్యర్థి మామిడి సర్వయ్యపై విజయం సాధించారు.