గల్ఫ్లో నిజామాబాద్‌వాసి మృతి
బిక్నూర్: బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన నిజామాబాద్ వాసి గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన బిక్నూర్ మండలం జంగంపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పుల్లూరి చంద్రయ్య(30) అనే వ్యక్తి పొట్టకూటి కోసం గల్ఫ్కు వెళ్లాడు. ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.