రైతు సమన్వయ సమితుల జాడెక్కడ? | no working of Telangana Rythu Samanvaya Samit | Sakshi
Sakshi News home page

రైతు సమన్వయ సమితుల జాడెక్కడ?

Published Tue, Jan 2 2018 3:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

no working of Telangana Rythu Samanvaya Samit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇప్పటివరకు కేవలం గ్రామ, మండల రైతు సమన్వయ సమితులనే ఏర్పాటు చేసింది. జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల జాడే లేకుండా పోయింది. వాస్తవంగా గ్రామ, మండల, జిల్లా రైతు సమస్వయ సమితులను గతేడాది సెప్టెంబర్‌ 9 నాటికి ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కేవలం గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, వాటికి సభ్యుల నియామకమే పూర్తయింది. జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదు. వాటి ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెప్పలేకపోతున్నాయి.  

రైతులకు అందుబాటులో ఉండాలని...
రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండేలా సమన్వ య సమితులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వడంలో సహకరించాలని, విత్త నం వేసే దగ్గరి నుంచి గిట్టుబాటు ధర వరకు సమితులు కీ లక పాత్ర పోషించాలన్నది సర్కారు ఆలోచన. ఆ ప్రకారం గ్రామ రైతు సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది, రాష్ట్రస్థాయిలో 42 మందిని నియ మించాలని నిర్ణయించింది. రాష్ట్ర సమితి సభ్యులను సీ ఎం, మిగిలిన స్థాయి సమితి సభ్యులను మంత్రులు నియమించేలా ఉత్తర్వులిచ్చింది. కానీ ఇప్పటివరకు గ్రామ, మండల సమితుల ఏర్పాటే జరిగింది. జిల్లా సమితులకు సభ్యుల ఎంపికలో సర్కారు తాత్సారం చేస్తోంది.

ఏంచేయాలో అర్థం కాని సభ్యులు...
గ్రామ, మండల సమన్వయ సమితి సభ్యుల నియామకం పూర్తయి 3 నెలలు దాటినా బాధ్యతలపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సభ్యులు గందరగోళంలో ఉండిపోయారు. ఖరీఫ్‌లో పండిన పత్తి, కంది తదితర పంటలకు సరైన ధర వచ్చేలా కృషి చేయాలని, మార్కెట్‌కు వచ్చే రైతులకు సమితి సభ్యులు సూచనలిచ్చేలా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలు పెద్దగా అమల వలేదు. మరోవైపు సమన్వయ సమితులను కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. దాని ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో స్పష్టత కరువైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement