అనుమానంతో గుర్తించిన బ్యాంకు అధికారులు
దొంగ వన్‌బీలేనని తేల్చిన రెవెన్యూ అధికారులు
మహబూబాబాద్‌లోని ఓ మీసేవా కేంద్రం ద్వారా దందా
నెల్లికుదురు : నకిలీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా వాటిని తలదన్నేలా దొంగ సాఫ్ట్‌వేర్లు పుట్టుకొస్తున్నాయి. ముగ్గురు తహసీల్దార్ల ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన వన్‌బీలను మీసేవా కేంద్రాల్లో తీసుకొచ్చి కొందరు, దొంగ పట్టాపాస్ పుస్తకాలను తయారు చేయించి మరికొందరు ఎన్ని బ్యాంకులుంటే అన్ని బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో మండలంలోని మదనతుర్తి, నైనాల గ్రామాలకు చెందిన కొందరు గతంలో రుణాలు పొందారు. వారే మళ్లీ రుణాల కోసం మహబూబాబాద్‌లోని ఓ మీసేవ కేంద్రంలో కొత్త సర్వే నంబర్లతో తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ వన్‌బీలు తయారు చేయించి ఎస్‌బీఐలో దరఖాస్తులు చేసుకున్నారు.
దొంగ వన్‌బీల బండారం బయటపడిందిలా..
గతంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి ఇప్పుడు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని అనుమానం వచ్చిన ఎస్‌బీఐ శాఖ అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆరాతీశారు. తహసీల్దార్ తోట వెంకటనాగరాజుకు వివరించగా నకిలీ(ఫేక్) వన్‌బీలను రె వెన్యూ సిబ్బందితో పరిశీలించారు. 122 కంప్యూటర్ పహణీలు, వన్‌బీలు పరిశీలించగా మదనతుర్తి గ్రామానికి చెందినవి 16, నైనాలకు చెందినవి 2 నకిలివీగా తేలడంతో రెవెన్యూ, బ్యాంకు అధికారులు కంగుతిన్నారు.
నకిలీ కంప్యూటర్ పహాణీలు, వన్‌బీలు ఉన్నవారి వివరాలు..
మండలంలోని మదనతుర్తి గ్రామశివారు తండాలకు చెందిన గుగులోతు హేమచంద్రు, గుగులోతు నరేందర్,గుగులోతులాలు,గుగులోతురాజు,భూక్య సుక్య, గుగులోతు లక్ష్మి, గుగులోతు చంత్రు, గుగులోతు వీరన్న, గుగులోతు పంతులు, గుగులోతు జవహార్‌లాల్, గుగులోతు శ్రీను, గుగులోతు లచ్చు, భూక్య మోహన్, గుగులోతు మాన్‌సింగ్, భూక్య జగ్మల్, నైనాల గ్రామానికి చెందిన గుగులోతు హచ్చాలి, గుగులోతు మగ్తి పేర్లు ఉన్నారుు. విచారణ చేపడితే ఇలాంటివిఇంకెన్నోబయట పడే అవకాశాలున్నాయి.
అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతోనే..
2013-14 ఆర్థిక సంవత్సరంలో నెల్లికుదురు రెవెన్యూ కార్యాలయంలోని ఇద్దరు రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి వందల మంది రైతులకు భూమి లేకున్నా తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు రాసివ్వడంతో మహబూబాబాద్ మండలంలోని అమనగల్ సిండికేట్ బ్యాంకులో రుణాలిచ్చారు. ఇలా తెల్లకాగితంపై సుమారు 408 మందికి రాసివ్వగా రూ.4 కోట్ల వరకు రుణాలు మంజూరయ్యూరుు. అరుుతే సంబంధిత ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి దొంగ వన్‌బీలు, పాస్ పుస్తకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని బ్యాంకుల్లో పూర్తి విచారణ చేపడితే ఇలాంటివెన్నో వెలుగులోకి వస్తాయని మండల ప్రజలు అనుకుంటున్నారు. దొంగ వన్‌బీలపై అధికారలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
తహసీల్దార్ తోట వెంకటనాగరాజును వివరణ కోరగా ఫేక్ వన్‌బీలు మీసేవా కేంద్రం నుంచి తీసినవే అవి దొంగవని తేలింది. విచారణ జరిపిన అనంతరం పూర్తి సమాచారంతో వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసులకు సమాచారం అందిస్తాం.
రుణాల కోసం ఎస్‌బీఐలో నకిలీ వన్ బీలు
Published Sun, Feb 15 2015 1:21 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement
Advertisement