
గాంధీ ఓపీ విభాగంలో చిట్టీల కోసం బారులు తీరిన రోగులు, సహాయకులు
గాంధీఆస్పత్రి: విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగం సోమవారం రోగులతోకిటకిలాడింది. రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు లేకపోవడంతో రోగులు, వారిసహాయకులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, బాలింతలు అవస్థలు పడ్డారు.ఓపీ, అత్యవసర విభాగాల వద్ద స్ట్రెచర్లు,వీల్‌ఛైర్లు కూడా అందుబాటులో లేక ప్రాణాపాయస్థితిలో తీసుకువచ్చిన రోగులను వారి కుటుంబ సభ్యులు చేతులపై మోసుకుని ఆస్పత్రిలోపలకు తీసుకువెళ్లారు. ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు, ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి నిరుపేద రోగులకు మౌలిక సదుపాయలు, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment