
సాక్షి, న్యూఢిల్లీ: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను ప్రాజెక్టు, అక్కన్నపేట్–మెదక్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించాల్సి ఉందని, అవి జమ చేయకపోవడం వల్లే రాష్ట్ర ప్రాజెక్టుల్లో పురోగతి లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బుధవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.