ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వెనకాల ఉన్న పోలీసు క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. 1978లో నిర్మించిన ఈ భవనాల కాలపరిమితి కూడా ముగిసింది. ఈ క్వార్టర్స్‌లో 40 పోలీసు కుటుంబాలు ఉంటున్నాయి. ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో క్వార్టర్స్ అసలే లేవు. బేల మండల కేంద్రంలో నాలుగు పోలీసు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న క్వార్టర్స్ కూడా శిథిలావస్థలోకి చేరుకోవడంతో ఇక్కడి పోలీసు కుటుంబాలు అద్దె గృహాల్లో ఉంటున్నాయి.
క్వార్టర్స్‌లో ఉన్న కొన్ని కుటుం బాలు కూడా శిథిలావస్థలో ఉన్న ఇవి ఎప్పుడు కూలిపోతాయోనని నిత్యం భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. హెచ్‌ఆ ర్ కింద రూ.3500 చెల్లిస్తున్నా.. క్వార్టర్స్‌లో సౌకర్యాలు కల్పిం చడం లేదని పోలీసు కుటుంబాలు వాపోతున్నాయి. కొన్ని పోలీసు కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటున్నాయి. పోలీసులకు కేటాయించిన గృహసముదాయాలు కూలడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు మండల, పట్టణ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, అధికారులు అక్కడ నివసించేందుకు విముఖత చూపుతున్నారు.
బిక్కుబిక్కుమంటూ..
శిథిలావస్థలో ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భవనం పెచ్చులూడి కింద పడిన సంఘటనలు కూడా ఉన్నాయని పోలీసుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భవనాలపై చెట్టు పెరగడంతో, గోడలు పగలడంతో ఎప్పుడు పడిపోతాయో తెలియకుండా ఉంది. జిల్లా కేంద్రంలోని పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నా.. తాగునీటి కోసం వేసిన బోరు మోటార్ మరమ్మతుకు పోలీసు కుటుంబాలే డబ్బులు కడుతున్నాయి. అది చెడిపోయినప్పుడల్లా అక్కడ ఉన్న కుటుంబాలు డబ్బులు జమ చేసి బాగు చేయించుకుంటున్నాయి.
చుట్టూ ప్రహరీ లేక పశువులు, పందులు ఆవరణలో సంచరిస్తున్నాయి. మురికి కాలువలు లే వు. క్వార్టర్స్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి భయంకరంగా కనిపిస్తున్నాయి. కేవలం తమకు భద్రతగా ఉంటుందని మాత్రమే పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నామే తప్ప.. మరేలాంటి సౌకర్యాలు లేవని వారు పేర్కొంటున్నారు. తమ సమస్యలపై చెబితే ఉన్నతాధికారులు ఏమంటారోనని చెప్పలేకపోతున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు.
రక్షకులకు రక్షణ కరువు..
Published Wed, Jul 16 2014 4:32 AM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM
Advertisement
Advertisement