
మొరుగుతున్న కాపలాకుక్క: పొన్నాల
తెలంగాణ వస్తే కాపలా కుక్కలా పడిఉంటానన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఇష్టానుసారంగా మొరుగుతున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
మద్దూరు, న్యూస్‌లైన్: తెలంగాణ వస్తే కాపలా కుక్కలా పడిఉంటానన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఇష్టానుసారంగా మొరుగుతున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా మద్దూరు రోడ్‌షోలో మాట్లాడారు. పార్టీలోని దళిత, గిరిజన, మైనార్టీ నేతలను అవమాన పరిస్తే పొలిట్‌బ్యూరోలో ఉన్న వారంతా బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడిని, ఉపముఖ్యమంత్రిని మైనార్టీ వారిని చేస్తాన్న కేసీఆర్.. ఆ మాట తప్పి తానే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్న ఆయన.. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాడా అని ప్రశ్నించారు.