‘కానిస్టేబుల్’కు అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ)పోస్టులతో పాటు ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులు, దేహ దారుఢ్య పరీక్ష వివరాలను విడుదల చేశారు.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.tslprb.in నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలను సరిచూసుకోవాలన్నా రు. దరఖాస్తు సమాచారంలో వ్యత్యాసాలుంటే 040-23150362/ 23150462 లలో లేదా support@tslprb.in కు మెరుుల్ ద్వారా సంప్రదించాలన్నారు.