వామపక్షాలే ప్రత్యామ్నాయం
- సంఘటిత పోరాటమే మార్గం
- వ్యవసాయ కార్మికులే కీలకం
- {తిపుర సీఎం మాణిక్ సర్కార్
- ఓసిటీలో భారీ బహిరంగ సభ
- తరలివచ్చిన వ్యవసాయ కార్మికులు
- నగరంలో ర్యాలీ.. ఎరుపెక్కిన ఓరుగల్లు
వరంగల్: దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలే నిలుస్తాయని, కార్పొరేట్ శక్తుల దోపిడీని అరికట్టేందుకు పోరాటం ఒక్కటే మార్గమని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలను పురస్కరించుకుని వరంగల్ ఓసిటీ మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో సాగే పోరాటంలో కీలక పాత్ర నిర్వహించాల్సింది వ్యవసాయ కార్మికులే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంలోనే వీరి పాత్ర ఉన్నతమైందన్నారు.
సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వా మపక్షాలకు అనుకూలంగా ఫలితాలు రాలేదని, ఈ ఫలి తాలు తీవ్ర నిరాశపరిచినప్పటికీ భవిష్యత్‌లో వామపక్షాలే ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్నారు. బహుళజాతి సంస్థ లు యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తున్నాయని, పీడిత వర్గా లు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాల కులు చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ తీరు ఇప్పటికే తేటతెల్లమైందన్నారు. ప్రజలపై భారం మోపే విధానాల ద్వారా తమ స్వభావాన్ని చాటుకున్నారని విమర్శించారు. లౌకిక తత్వానికి విరుద్ధంగా మైనార్టీలపై దాడులు సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాన్ని నివారించాలని కోరారు. ఎన్నికలకు ముందు యువతను ఆకర్షించేందుకు బీజేపి అనేక ఎత్తులు వేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవడం లేదని మాణిక్ సర్కార్ విమర్శించారు. దేశంలో 18 నుంచి 20 కోట్ల మంది ఉన్న యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశం ఇప్పుడు ఎజెండాలో లేకుండా పో యిందన్నారు. తాజా బడ్జెట్‌లో వారికి ఉద్యోగాలు కల్పించే అంశమే ప్రాధాన్యతకు నోచుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారి వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్భర స్థితిలో వ్యవసాయ కార్మికులు
వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇందులో గ్రామీణ పేదలు, దళిత, పీడిత వర్గాలు ఎక్కువగా ఉన్నారన్నారు. కనీస వేతనాలు లేవు.. జీవితాలకు రక్షణ లేద న్నారు. రానున్నకాలంలో వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా విస్తరించి సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ కార్మికుల పోరాట చైతన్యస్థాయిని పెంపొందిస్తూనే ఈ దోపిడీకి వ్యతిరేకంగా సాగే వర్గపోరాటంలో కీలక భూమిక నిర్వహించాలన్నారు. ఈ దిశగా మహాసభల్లో లోతైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యతన జరిగిన ఈ బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, అధ్యక్షుడు పాటూరి రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లుస్వరాజ్యం తదితరులు ప్రసంగించారు.
భూ సంస్కరణ లతోనే పేదల అభివృద్ధి
హన్మకొండ సిటీ : భూ సంస్కరణలతోనే పేదల అభివృద్ధి సాధ్యమని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నా రు. బుధవారం హన్మకొండకు వచ్చిన ఆయన.. సర్క్యూ ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. త్రిపురలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూమి పంపిణీ చేసినప్పటికీ సాగునీటి సౌకర్యం కల్పించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 98 శాతం సాగునీటి వసతి సౌకర్యం కల్పించామన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపురలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామ ని, తమ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ విద్యుత్‌ను విని యోగించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాలనే అలోచనలో ఉన్నామన్నారు. ఆ హార భద్రత పథకం ప్రారంభించి ప్రతి కు టుంబానికి 35 కిలోల బియ్యం అందిస్తున్నామని ఆయన వివరించారు. ఉపాధి హామీ ప థకం సక్రమంగా అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా భూ సంస్కరణలు చేపట్టి పకడ్భందీగా అమలు చేయాలని, అప్పుడే ఇక్కడి పేదల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
అధికారులు, నాయకుల స్వాగతం
జిల్లాకు వచ్చిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌కు జిల్లా కలెక్టర్ జి.కిషన్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు స్వాగత ం పలికారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.నాగయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.సాంబశిరావు, డీఆర్వో సురేంద్రకరణ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు కలిసి పుష్పగుచ్చాలు అందించారు.
నేడు ప్రతినిధుల సభ
వరంగల్ : హన్మకొండ నందన గార్డెన్ (సుందరయ్య నగర్)లో గురువారం ఉదయం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటలకు పతాకావిష్కరణ, 11గంటలకు ఆహ్వాన సంఘం చైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు స్వాగతోపన్యాసం ఉంటుంది. 12గంటలకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఉపన్యాసం ఉంటుంది. తర్వాత కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. ఈ మహాసభలో పాల్గొనేందుకు 29 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. ప్రతినిధుల కోసం నగరంలోని పలు సెంటర్లలో వసతి కల్పించారు. ఈ మహాసభల్లో జాతీయ అధ్యక్షులు పాటూరు రామయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.నాగయ్య, బి.వెంకట్, నాయకులు మురళీకృ ష్ణ, వెంకటేశ్వర్లు, జాతీయ నాయకులు పాల్గొంటారు.