
మాట్లాడుతున్న తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు
మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10నుంచి ప్రారంభం కానుంది. ఎకరాకు రూ.4వేలు, ఏడాదికి రూ.8వేలు చెక్కుల రూపంలో అందించడం, చెక్కులతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో ఆరు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం ఆర్‌అండ్‌బీలో తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
10న ఎదిర జెడ్పీహెచ్‌ఎస్, 11న మహబూబ్‌నగర్ మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్, 12న ఏనుగొండ జెడ్పీహెచ్‌ఎస్, ఎర్రవల్లి యూపీఎస్, 14న బోయపల్లి జెడ్పీహెచ్‌ఎస్, 15న పాలకొండ యూపీఎస్ పాఠశాలల్లో చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. రూ. 2.77కోట్ల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్కో బృందం సుమారు 300మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. సమావేశంలో డీటీలు అఖిలప్రసన్న, కోట్ల మురళీధర్, ఏఓ నాగరాజు, ఆర్‌ఐ క్రాంతికుమార్‌గౌడ్, ఏఆర్‌ఐ హనీఫ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాములు తదితరులు పాల్గొన్నారు.