డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : ప్రస్తుతం అధికారం చేపట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో గ్రామీణ యువతకు స్వయంఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చెప్పారు. బుధవారం డిచ్‌పల్లి టీటీడీసీ ఆవరణలో ఎస్‌బీహెచ్ ఆధ్వర్యంలో *కోట్ల వ్యయంతో నిర్మించిన ‘గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌ఎస్‌ఈటీఐ)’ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి నైపుణ్యాలను వెలికి తీసే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఏ శిక్షణ కేం ద్రంలోనైనా జీవితాంతం సరిపోయే శిక్షణ ఇవ్వలేరని, మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా ఎప్పటి కప్పుడు కొత్త విధానాలను మనకు మనమే నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. జ్ఞానం అనేది ఎంతో విలువైనదని, మనం ఎంచుకున్న రంగంలో జ్ఞానం సంపాదిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలెదురైనా పరిష్కరించుకోవచ్చన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యువత ముందుగా కోరుకోనేది ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం. అయితే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే సాధ్యం కాదని, అందుకే యువత స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి చూపించే మార్గం ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే.. చౌకధరల దుకాణం డీలర్ పోస్టుకు ఇంటర్వ్యూ పిలిచినా, పీజీ చేసిన వారు సైతం హాజరువుతున్నారని ఉదాహరణగా తెలిపారు.
పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
త్వరలో అధికారం చేపట్టనున్న ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాలను పరిశీలిస్తే, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఎస్‌బీహెచ్ ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది, స్వయం ఉపాధి పొందుతున్న యువత వివరాలను సంస్థ ప్రతినిధులు నమోదు చేసుకోవాలని సూచిం చారు. ఏడాది, రెండేళ్ల తర్వాత వారు స్వయం ఉపాధి పొందుతున్నారా లేదా వాటిని వదిలేసి ఇంటికి చేరుకున్నారా అనే విషయాన్ని గమనించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక డాటా విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల ని కలెక్టర్ సూచించారు.
అనంతరం ఎస్‌బీహెచ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. 2002లో ఎస్‌బీహెచ్ ఆ ధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఈటీఐ ను మొట్టమొదట వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడు కేంద్రాలు, కర్ణాటకలో రెండు, మ హారాష్ట్రలో మూడు శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నా రు. గ్రామీణాభివృద్ధిశాఖ వారు చేసిన సర్వేల్లో ఈ శిక్షణ కేంద్రం ‘ఏఏ’ గ్రేడ్ సాధించిందన్నారు. కార్య క్రమంలో ఆర్‌బీ ఐ రీజనల్ డెరైక్టర్ కేఆర్‌దాస్, ఎస్‌బీహెచ్ సీజీఎంలు సురేశ్‌బాబు, ఎస్.వెంకటరామన్, జీఎం ఆర్‌ఎన్.డా ష్, ఆర్‌ఎస్‌ఈటీఐ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీసీ దాస్, సం స్థ డెరైక్టర్ విష్ణుకుమార్, సర్పంచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
యువతకు పెద్దపీట
Published Thu, May 22 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement