కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ న లుగురు అధికారులు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎస్‌కే.జోషి ఆదేశించారు. బుధవారం 207, 208, 209, 210 నంబర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ వేర్వేరుగా నాలుగు జీవోలు జారీ చేశారు. ఈఈగా పనిచేసిన ఎ.శివ కుమార్, డీఈగా పనిచేసిన ఎ.లక్ష్మీనారాయణ, ఏఈగా పనిచేసిన టి.ప్రభువర్ధన్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సాంబశివరావు ప్రభుత్వ నిబంధనలు, రూల్స్ అతిక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
అయితే ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే వివరాలు మాత్రం ఈ నాలుగు జీవోల్లో ఎక్కడా పేర్కొనలేదు. అయితే కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న కులాయి కనెక్షన్ల కుంభకోణంలో పలువురు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. నిరుపేదలకు రూ.200కు సబ్సిడీపై మంజూరు చేయియాల్సిన కులాయిలను, ధనవంతులకు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గులాబీ రంగు రేషన్‌కార్డులను, తెల్ల రేషన్‌కార్డులుగా కంప్యూటర్లలో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడిన వారికి... అధికారులు అండగా నిలిచారని ఆరోపణలు వచ్చాయి.
ఈ అక్రమంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నలుగురు అధికారులపై అప్పటి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయని సమాచారం. 2012 ఆగస్టు 18న కూడా అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1106 జారీ చేసింది. ఇదే జీవోను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం ఈ నలుగురు అధికారుల నుంచి వివరణ కోరుతూ నాలుగు జీవోలను విడుదల చేసింది. అయితే ఈ నలుగురు అధికారుల్లో ప్రస్తుతం సాంబశివరావు రిటైర్డ్ అయ్యాడు. మిగిలిన ముగ్గురు అధికారులు వేర్వేరు మున్సిపాలిటీల్లో పని చేస్తున్నారు.
‘బల్దియా’ అక్రమాలపై సర్కార్ సీరియస్
Published Thu, Dec 25 2014 1:05 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement