*నగర పంచాయతీ పరిధిలో మురికి నీరు సరఫరా
*కాలుష్యపు కోరల్లో చలివాగు.. కానరాని శుద్ధి చర్యలు
*నిరుపయోగంగా ఫిల్టర్‌బెడ్‌లు.. లక్షల రూపాయలు వృథా
*చలివాగు నుంచి నేరుగా నల్లాలకు పంపింగ్
*రోగాల బారిన పడుతున్న జనం
*ఐదేళ్లుగా కొనసా..గుతున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్మాణం
పరకాల : ఈ ఫొటోలో కనిపిస్తున్న నీటినే పరకాల ప్రజలు తాగుతున్నారు. అధికారులు ఈ రంగు మారిన నీళ్లనే పంపింగ్ చేస్తున్నారు. ప్రజలు గత్యంతరం లేక ఆ నీటినే తాగుతున్నారు. దీంతో రోగాల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగు తున్నారు. పరకాల... మేజర్ గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీగా మూడేళ్ల క్రితం అప్‌గ్రేడ్ అరుుంది. కానీ... ప్ర‘జల’ రాత మారలేదు. ఇందుకు నల్లాల ద్వారా సరఫరా అవుతున్న రంగు మారిన నీళ్లే నిదర్శనం. అంతేకాదు... వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో కలుషిత నీటి బాధలు ఇక్కడి ప్రజలకు షరామామూలుగా మారారుు. పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి.. దశాబ్దాలుగా వారికి తాగునీటి తిప్పలు తప్పడం లేదు. వ్యాపార, వాణిజ్యపరంగా దూసుకుపోతున్న పట్టణంలో స్వచ్ఛమైన తాగు నీరు లభించని దుస్థితి నెలకొంది.
నిరుపయోగంగా ఫిల్టర్‌బెడ్‌లు
పరకాల పట్టణంలో సుమారు 40 వేల జనాభా ఉంది. ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, కేటీపీపీ కార్మికులుతోపాటు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉంటున్నారు. ఏటేటా పట్టణ జనాభా పెరుగుతూ వస్తోంది. అరుునా... సరైన నీటి వసతులు కల్పించడంలో అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు విఫలమయ్యూరు. పట్టణ ప్రజలకు చలివాగు చెక్‌డ్యాం నుంచి తాగు నీరు అందుతోంది. పట్టణ శివారు నుంచి మూడు కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి వాగులోని నీటిని నేరుగా పంపింగ్ చేస్తున్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు రెండు ఫిల్టర్‌బెడ్‌లు నిర్మించినా... అవి నిరుపయోగంగానే ఉన్నారుు. 1999లో రూ.33 లక్షలతో ఒక ఫిల్టర్‌బెడ్ నిర్మాణం చేపట్టారు. 2004లో మరో ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించారు. అవి అందుబాటులోకి రాకపోవడంతో నీటి శుద్ధి కార్యక్రమం అమలుకునోచుకోలేదు. 2009లో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టినా... అర్ధంతరంగా ఆపివేశారు. ఇలా లక్షల రూపాయలు వెచ్చించినా... ప్రజలకు మంచి నీళ్లు అందని ద్రాక్షగా మారారుు.
కాలుష్యం బారిన చలివాగు
పట్టణ ప్రజలకు తాగునీరు అందించే చలివాగు చెక్‌డ్యాం వ్యర్థ పదార్థాలతో నిండుతోంది. చలివాగు పరివాహక ప్రాంతం వెంట శాయంపేట మండల పరిధిలోని కొప్పుల, రేగొండ మండలం దామరంచపల్లి, చెన్నాపూర్ గ్రామాలు ఉన్నారుు. ఈ గ్రామాలకు చెందిన కొందరు గుడుంబా బట్టీలను పెట్టి అందులోంచి వచ్చే వ్యర్థపదార్థాలను వాగులోకి వదిలిపెడుతున్నారు. పరకాల పెద్ద చెరువు కింది భాగంలో కూడా గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి... వాటి పానకంను ఇందులోకి విడిచి పెడుతున్నారు. అంతేకాకుండా.. పశువుల కళేబరాలను వాగులో వేస్తున్నారు. దీంతో చలివాగు నీరు కలుషితమవుతోంది.
ఊరిస్తున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్
పట్టణానికి మంచి నీరు అందించేందుకు 2009లో శాయంపేట మండలం జోగంపల్లిలోని చలివాగు వద్ద రూ.9 కోట్లతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు గడిచినా... ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు. పట్టణంతోపాటు పరకాల, శాయంపేట, మొగుళ్లపల్లి మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ నీళ్లు ప్రజలను కొన్నేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు పైపులైన్ నిర్మాణం పూర్తి కాలేదు. పట్టణంలోని మసీదు వద్ద బండరాయి అడ్డు రావడం, కొన్ని దుకాణాలు పోయే అవకాశముండడంతో ఈ పనులు పెండింగ్‌లో పడ్డాయి
నల్లనీళ్లు తాగేదెట్లా?
Published Tue, Jul 29 2014 11:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement
Advertisement