
దొంగే.. దొంగా దొంగాని అరిచినట్టుంది: శ్రీనివాసగౌడ్
హైదరాబాద్: అవమానాలు పడ్డ చోటే లక్షకోట్ల రూపాయల బడ్జెట్తో తెలంగాణ అసెంబ్లీ జరగడంపై తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ టీడీపీ, కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు.