శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి దిగువ, ఎగువ లోయర్ మానేరు డ్యామ్ కింది ప్రాంతాలకు తాగునీటి కేటాయింపుల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్ సిటీ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి దిగువ, ఎగువ లోయర్ మానేరు డ్యామ్ కింది ప్రాంతాలకు తాగునీటి కేటాయింపుల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బుధవారం నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులిచ్చారు. వాటి మేరకు ఎల్‌ఎండీ ఎగువన ఉన్న నిర్మల్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల్ మున్సిపాల్టీలతో పాటు మరిన్ని గ్రామాలకు కలిపి మొత్తంగా 3.8టీఎంసీల నీటిని, ఎల్‌ఎండీ దిగువన ఉన్న కరీంనగర్, సిధ్ధిపేట, సిరిసిల్ల తాగు నీటి అవసరాలకు మొత్తంగా 2.57టీఎంసీల నీటిని ఈ నెల నుంచి జులై వరకు నిర్ధారించిన మేరకు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.