కారు ఢీకొని విద్యార్థిని మృతి | student dies in car accident at nalgonda district | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని విద్యార్థిని మృతి

Published Sun, Dec 13 2015 12:13 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student dies in car accident at nalgonda district

నల్గొండ: నల్గొండ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు ఢీకొనడంతో సాయిగీత(11) అనే విద్యార్థిని మృతి చెందగా.. ఆమె తల్లికి గాయాలయ్యాయి. 

ఈ సంఘటన చివ్వెమ్ల మండలం జి.తిరుమలగిరిలో చోటుచేసుకుంది. ప్రమాదసమయంలో సాయిగీతతో పాటు ఉన్న ఆమె తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. సాయిగీత సూర్యాపేటలోని ఓ స్కూల్లో ఆరోగతి తరగతి చదువుతోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement