
నరసింహ, రాజులను సాదరంగా ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ ప్రమోద, విద్యార్థినులు
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లే ముఖ్య అతిథులయ్యారు. ఈ అరుదైన సంఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల/పాఠశాలలో జరిగింది. ఇక్కడ చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థినుల వీడ్కోలు వేడుక శనివారం రాత్రి నిర్వహించారు. దీనికి గతానికి భిన్నంగా పాఠశాలలో స్వీపర్లు నరసింహ, రాజును ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
సాంప్రదాయం ప్రకారం ప్రధాన గేటు వద్ద అతిథులకు ప్రిన్సిపల్ ప్రమోద పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. విద్యార్థులు గౌరవ మర్యాదలతో వేదిక వద్దకు తీసుకెళ్లి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ, రాజు మాట్లాడుతూ.. కలలో కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment