మందు తాగే వాళ్లకు పాల గురించి ఏం తెలుసు: రేవంత్ | tdp mla revanth reddy takes on trs government | Sakshi
Sakshi News home page

మందు తాగే వాళ్లకు పాల గురించి ఏం తెలుసు: రేవంత్

Published Wed, Nov 12 2014 11:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

మందు తాగే వాళ్లకు పాల గురించి ఏం తెలుసు: రేవంత్ - Sakshi

మందు తాగే వాళ్లకు పాల గురించి ఏం తెలుసు: రేవంత్

హైదరాబాద్ :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. ఫామ్హౌస్లో మందు తాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పాల గురించి ఏం తెలుసని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. కేరళలో హెరిటేజ్ సంస్థపై నిషేధం లేదని... విధించిన నిషేధాన్ని కేరళ ప్రభుత్వమే ఎత్తివేసిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి...ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రూ.10 కోట్లు తీసుకున్నందుకు సస్పెండ్ చేసిన కేసీఆర్...తర్వాత తన వాటా ఇవ్వగానే సస్పెన్షన్ ఎత్తివేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


కేసీఆర్ మాదిరే కేటీఆర్ కూడా సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 'మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యేలనటం అవమానించటమే. మమ్మల్నే కాదు..మమ్మలి గెలిపించిన తెలంగాణ ప్రజలను అవమానించటమే. తక్షణమే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేదంటే కేటీఆర్పై స్పీకర్కు హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ సరిగా స్పందించకుంటే ఆయనపై కూడా అవిశ్వాసం పెడతాం' అని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement