- జిల్లాలో ఒక్క స్కూల్ కూడా మూతపడదు...
- 63 సక్సెస్ హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఎత్తివేత
- అసలే విద్యార్థులు లేని పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు
- 0-19 మందికి ఒక్కరు... 31-60 మందికి ఇద్దరు టీచర్లు
- పూర్తికావొచ్చిన మిగులు టీచర్ పోస్టుల సర్దుబాటు ప్రక్రియ
విద్యారణ్యపురి : టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ జీఓ ఎట్టకేలకు సవరణకు నోచుకుంది. ఇటీవల విడుదల చేసిన జీఓ ప్రకారం ఒకటి నుంచి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ఉండడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. రేషనలైజేషన్ జీఓకు సవరణలు చేయాలని విద్యాశాఖమంత్రికి పలు సంఘాల నాయకులు విన్నవించారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం సవరణలు చేస్తూ శనివారం రాత్రి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలకు కూడా ఒక్కో టీచర్‌ను కేటాయించారు. జిల్లాలో 104 ప్రాథమిక పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు.
అయినప్పటికీ ఆయా పాఠశాలలను కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆయూ పాఠశాలల్లో ఒక్కో టీచర్‌ను కొనసాగి స్తారు. విద్యార్థులను నమోదు చేయించుకునే బాధ్య త మాత్రం ఉపాధ్యాయులదే. మొత్తానికీ... రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలో ఒక్క ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా మూతపడదు. అదేవిధం గా... ప్రాథమిక పాఠశాల(పీఎస్)ల్లో 31 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, 61నుంచి 90 వ రకు ముగ్గరు, 91 నుంచి 120 వరకు నలుగురు, 121నుంచి 150 వరకు ఐదుగురు, 151 నుంచి 200 వరకు ఆరుగురు, 201 నుంచి 240 వరకు ఏడుగు రు, 241 నుంచి 280 వరకు ఎనిమిది, 281 నుంచి 320 వరకు తొమ్మిది, 321 నుంచి 360 వరకు పది, 361నుంచి 400 వరకు 11మంది ఉపాధ్యాయులను కేటాయించారు. విద్యార్థుల సంఖ్యపెరిగే ప్రతి 40 మందికి ఒక టీచర్ చొప్పున కేటారుుంచనున్నారు.
63 సక్సెస్ హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఎత్తివేత
50 లోపు విద్యార్థులున్న ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ఎత్తివేయాలని రేషనలైజేషన్ జీఓలో స్పష్టం చేశారు. ఈ నిబంధనను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎత్తివేయలేదు. దీంతో జిల్లాలో 50లోపు విద్యార్థులున్న 63 హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఎత్తివేయనున్నారు. ఈ హైస్కూళ్లు యధావిధిగా ఉం టారుు. వీటిలో తెలుగు మీడియంలో విద్యాబోధన కొనసాగుతుంది. ఎత్తివేయనున్న 63 ఇంగ్లిష్ మీడి యం హైస్కూళ్లలో 1031మంది విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వీరిని ఆయూ పాఠశాలల సమీపంలోని అన్ని వసతులు కలిగిన హైస్కూళ్లలో చేర్పించాల్సి ఉంటుంది. ఇం గ్లిష్ మీడియంలో 50 మందికంటే విద్యార్థులున్న హైస్కూళ్లకు నాలుగు స్కూల్‌అసిస్టెంట్ పోస్టులు ఇస్తున్నారు. అరుుతే ఆయూ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఎత్తివేతపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సక్సెస్ హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం ఎత్తివేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్దుబాటు ప్రక్రియ
రేషనలైజేషన్ సవరణలు చేసి సర్దుబాటుకు మార్గదర్శకాలు రావడంతో మిగులు పోస్టుల లెక్కల్లో విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యూరు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆదివారం అధికారులు, సిబ్బంది లెక్కలు తీస్తున్నారు. రేషనలైజేషన్‌కు సవరణలు చేయడం వల్ల మిగులు పోస్టులు కొంతమేర తగ్గుతున్నాయి. వీటిని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియ డీఈఓ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కొనసాగింది. రేషనలైజేషన్‌లో ఏయే పాఠశాలల్లో ఎన్ని మిగులు పోస్టులు ఉన్నారుు... ఇతర పాఠశాలల్లో ఎన్ని సర్దుబాటు అయ్యూరుు... ఏయే పాఠశాలల్లో పోస్టులు పోతున్నాయో వాటి జాబితాను అర్ధరాత్రి తర్వాత వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఎవరి పోస్టు పోతుందో... ఆయా టీచర్లు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి.
ఉదాహరణకు ఒక పాఠశాలలో సున్నా నుంచి 19 మంది విద్యార్థులుండి.. ఇద్దరు టీచర్లు ఉన్నారనుకుంటే ఒక పోస్టును అక్కడి నుంచి తీసి వేరే స్కూల్‌లో సర్దుబాటు చేస్తారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు ఎంతమంది ఉండాలనేది పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్లకు వేర్వురుగా రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇలా అన్ని కేటగిరి పాఠశాలలో కలిపి వెయి నుంచి 1100 వరకు టీచర్ల మిగులు పోస్టులు ఉంటాయని ప్రాథమిక అంచనా. కచ్చితంగా మిగులు పోస్టులు ఎన్ని ఉంటాయనే అంశంపై సోమవారం స్పష్టత రానుంది.
‘రేషనలైజేషన్’కు సవరణలు
Published Mon, Jun 29 2015 3:47 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement