రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. చిన్నర్వ శ్రీశైలం (40) పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అవి దెబ్బతినడం, మరోవైపు రెండు బ్యాంకుల్లో 1.20 లక్షలు అప్పులు ఉండడంతో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. శ్రీశైలం భార్య కూడా ఏడాది క్రితం ఇదే విధంగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో వీరి నలుగురు కుమార్తెలు అనాథలయ్యారు.