భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై నాయికన్‌పేట సర్పంచ్ వొడ్డేటి అశోక్ దాడికి నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తున్నట్లు మీ సేవ కేంద్ర నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమ్రాన్‌సింగ్ తెలిపారు.
* భీమిని తహశీల్దార్‌పై దాడికి నిరసనగా..
* మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సంఘం నిర్ణయం
సాక్షి, మంచిర్యాల : భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై నాయికన్‌పేట సర్పంచ్ వొడ్డేటి అశోక్ దాడికి నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తున్నట్లు మీ సేవ కేంద్ర నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమ్రాన్‌సింగ్ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాల అమలు.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై ప్రజాప్రతినిధుల చేస్తున్న దాడులను ఆయన ఖండి ంచారు. భవిష్యత్‌లో ప్రభుత్వ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 190 మీ సేవ కేంద్రాల నిర్వాహకులంతా విధిగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.