నేలకొండపల్లి: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి ఆలీం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తోందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా కేంద్రంలోనే పత్తిని విక్రయించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరలిలా..
పత్తి పొడువు పింజ రకం,రూ.4050.
మధ్యరకం.రూ.3750.
రైతులు పాటించాల్సిన నిబంధనలు...
పత్తిని బస్తాలు, బోరాలలో కాకండా బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, లారీలలో విడిగా అమ్మకానికి తీసుకరావాలి.
పత్తి సహజ రంగు మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తేమ 8 శాతానికి తక్కువగా ఉండాలి.
మార్కెట్ కమిటి ఇచ్చిన టోకెన్‌లో తెలిపిన ప్రకార ం తీసుకరావాలి.
కేంద్రానికి వచ్చేటపుడు మీ సేవా, లేదా పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని రావాలి.
పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మ రెమ్మలు, చెత్త లేకుండా శుభ్రం చేయాలి.
అమ్మకాల అనంతరం రైతుకు ఆన్‌లైన్ ద్వారా 48 గంటలలో డబ్బు అందుతుంది. అందుకు రైతుల బ్యాంక్ పుస్తకాల జిరాక్స్‌పత్రాలు తేవాలి.
మార్కెట్ యార్డులో బీడీలు, సిగిరెట్లు కాల్చటం, వంట చేసుకోవటం లాంటివి చేయకూడదు.
నేడు సీసీఐ కేంద్రం ప్రారంభం
Published Mon, Nov 3 2014 2:56 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement