27న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీ | TRS Legislative Party meeting on 27 | Sakshi
Sakshi News home page

27న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీ

Published Tue, May 23 2017 8:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

27న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీ - Sakshi

27న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 27న శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణభవన్‌లో జరుగనుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను ఆహ్వానించారు.
 
సాధారణంగా పార్లమెంటు, శాసనసభ సమావేశాల సందర్భంగా ఎల్పీ సమావేశం జరగడం ఆనవాయితీ. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాల నేపథ్యంలో సీఎం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement