
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ‘రాణి’ అనే ఏనుగును అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. సోమవారం జూ పార్కును సందర్శించిన ఆమె రాణిని ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల చెక్‌ను క్యూరేటర్, ఐఎఫ్‌ఎస్ అధికారిని క్షితిజకు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ... జూపార్కులో వన్యప్రాణుల సంరక్షణ బలోపేతం చేయడంలో భాగంగా ఉపాసన కొణిదెల చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. అడవి జంతువుల పరిరక్షణలో ఉపాసన కృషి అభినందనీయమన్నారు. ఉపాసన నిబద్ధత చాలా మందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. కరోనా కాలంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారని క్షితిజ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఉపాసన పుట్టినరోజు కావడం విశేషం.
(పూల హరివిల్లు మధ్య ఉపాసన: చెర్రీ విషెస్)
(పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్)
Comments
Please login to add a commentAdd a comment