టీఆర్ఎస్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదిలాబాద్ : టీఆర్ఎస్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి గెలవలేరనే ఉద్దేశ్యంతోనే రాజీనామా చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలిచి తమ సత్తా చాటుకోవాలని ఆయన సవాల్ విసిరారు.