గుడిహత్నూర్‌లో మురుగు పూడిక తీస్తున్న పంచాయతీ కార్మికులు
సాక్షి, గుడిహత్నూర్ (ఆదిలాబాద్) : గ్రామ పంచాయతీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగు కన్పించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు దశాబ్ధాలుగా పని చేస్తూ.. నేడో..రేపో తమను గుర్తించక పోతారా..? అనే ఆశతో కడుపు నింపని జీతాలతో దయనీయ స్థితి లో ఇటు పని భారాన్ని.. అటు కుటుం బ భారాన్ని మోస్తున్నారు. ఈ పని వదిలి బయటకు వెళ్లలేక.. అదనపు ఆదాయం కో సం మరో పని చేయలేక సతమతమవుతున్నారు.
పంచాయతీల్లో పని చేసే కారోబార్‌లు, దినసరి ఉద్యోగులు, పారిశుధ్య కార్మి కులు, పంచాయతీల్లో వివిధ పనుల కోసం నియమించిన కామాటీల పరిస్థితి దారుణంగా ఉంది. వీరంతా గ్రామాల్లో కాలువ ల నిర్వహణ, చెత్త సేకరించి తరలించడం, సమయానికి తాగునీరు అందించడం, ప న్నులు వసూలు చేయడం, వివిధ ప్రభు త్వ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయ డం దండోరా ఇచ్చి ప్రజలను పోగు చేయ డం నుంచి పశు కళేబరాలను తరలిం చడంతో పాటు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నా..ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి గుర్తింపు లభించడం లేదు.
చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోయడం తమ వల్ల కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కారో బార్లు 35 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నా వీరికి నెలకు కేవలం రూ.5 నుంచి 7వేల జీతం దాటలేదు. మరి కొందరికి రూ. 3 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ జీ తంతో ఈ రోజుల్లో కుటుంబ పోషణ ఎలా చేయగలం? అంటూ దిగులు పడ్తున్నారు. బంజరు దొడ్డి నిర్వహణ, పన్నుల వసూలు, వీధి దీపాల నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, రికార్డులు భద్రపరచడం తదితర పనులు చేస్తూ పంచాయతీలకు ఆదాయం సమకూరుస్తున్నా పనికి తగ్గ వేతనం అంద డం లేదని ఆందోళన చెందుతున్నా రు.
ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని కారోబార్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారానికై ఉమ్మడి జిల్లాలోని పం చాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశా రు. వీరిలో కారోబారీ, కామాటీ, పంప్ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషన్, వాచ్‌మెన్, బిల్ కలెక్టర్లు ఉన్నా రు. అప్పట్లో వీరితో చర్చలు జరిపిన ప్రభుత్వం న్యా యం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చుకోలే దు. దీంతో వీరంతా తమ జీవితాలు, జీతాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
35 సంవత్సరాలుగా ..రూ.7వేలు దాటని జీతం
నేడు సగటు మనిషి జీవన వ్యయం రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. సాధారణ ఉపాధి కూలీ సైతం ఒక పూట పని చేసి రోజుకు రూ.200పైనే సంపాదిస్తున్నారు. కానీ పంచాయతీ కార్మికులు కనీస వేతనం అందడం లేదు. పంప్ ఆపరేటర్ల వేతనం నెలకు రూ.2500 ఇస్తుండగా, ఇక ఊరి మురికిని తమ చేతుల్లో ఎత్తి దూరంగా తీసుకెళ్లి పడేస్తున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరి వేతనం మొన్నటి వరకు రూ.2500 ఉండగా ఇటీవలే రూ. వెయ్యి పెంచి రూ.3500 ఇస్తున్నారు. ఇప్పటికే రిటైర్మెంట్ దగ్గర పడుతున్న వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటే గుండె బరువెక్కుతుంది.
ఇచ్చే జీతం కూడా నెల నెలా సక్రమంగా అందక నెలల తరబడి వేతనం కోసం పడిగాపులు కాస్తున్నారు. పంచాయతీకి పట్టుకొమ్మల్లా ఉంటూ నిరంతర సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. వీరికి కనీస వేతనాలు ఇవ్వక పోగా వచ్చే నెల జీతం భోజన సరుకులు కొనుగోలు చేయడానికే సరిపోక పోవడం దురదృష్టకరం. నూతన పంచాయతీ చట్టం ఏర్పాటు అనంతరం వీరి జీవితాల్లో ఆనందం కనిపిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నా వీరికి ఇప్పటి వరకు వీరి పట్ల ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో నిరాశే మిగిలింది. పాలకులు తమ జీవితాలను ఒక్కసారి పరిశీలించి తమకు న్యాయం చేయాలని వీరు చేతులెత్తి వేడుకుంటున్నారు.
కలగానే మిగిలేలా ఉంది
1978 మార్చి 1 నుంచి పంచాయతీ కారోబార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం రూ. వెయ్యి జీతం ఇస్తున్నారు. దీన్ని బట్టి నా గత జీతం ఎంతో అర్థమయ్యే ఉంటుంది. ఏనాటిౖMðనా ప్రభుత్వం గుర్తించకుండా పో తుందా? అనే నమ్మకంతో ఉన్నా. 41 సంవత్సరాలు కావొస్తోంది. నా కల..కల్లగానే మిగిలేలా ఉంది. న్యాయం చేయాలి.
–ధనూరే మారుతిరావ్, కొల్హారీ కారోబారి
జీతం తక్కువ..పని ఎక్కువ
రోజంతా వాడ వాడన తిరిగి చెత్త లేకుండా చూసుకోవడం, మురుగు కాలువల్లో నిలబడి పేరుకుపోయిన మురుగు తీసేయ్యడం. పంచాయతీ అధికారులు చెప్పిన పని చేయడం ఇలా రోజంతా చాకిరీ చేస్తున్నాం. జీతం మాత్రం కిరాణ, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా సరిపోదు. కనీసం రోజుకు రూ. 500 అయినా ఇవ్వాలి.
–కల్లెపెల్లి లక్ష్మీబాయి, పారిశుధ్య కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment