కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం దావా!
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మధ్య పోరాటం సాగుతోంది. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై సోమవారం పరువునష్టం దావా వేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. వ్యక్తిగత హోదాలోనే కేసు పెట్టనున్నట్టు తెలిపారు.
కాగా, డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై విచారణకు కేజ్రీవాల్ ఆదేశించారు. గోపాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టనుందని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్, జైట్లీ వ్యూహప్రతివ్యూహాలతో హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి.