దుర్గాపూర్: పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్లోని సీపీఎం కార్యాలయంలో బాంబులను, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పార్టీ కార్యాలయంలో సోదాలు చేయగా రెండు బ్యాగుల్లో దాచిన 15 నుంచి 20 బాంబులను గుర్తించారు. 7 పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.
పార్టీ కార్యాలయంలో బాంబులను, ఆయుధాలను ఉంచిన ఘటనలో సీపీఎంకు సంబంధంలేని ఆ పార్టీ జోనల్ సెక్రటరీ పంకజ్ రాయ్ సర్కార్ చెప్పారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. కాగా ప్రజల్లో భయాందోళలు కలిగించడానికి సీపీఎం ఆయుధాలను సమకూర్చుకుందని ఐఎన్టీటీయూసీ నాయకుడు ప్రభాత్ ఛటర్జీ ఆరోపించారు.
సీపీఎం ఆఫీసులో బాంబులు స్వాధీనం
Published Fri, Sep 16 2016 8:24 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement