బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.
న్యూఢిల్లీ: బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను గుజరాత్‌లో అడ్డుకోవడంపై ఏఏపి కార్యకర్తలు ఆందోళన ఇక్కడ ఆందోళనకు దిగారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళన చేశారు.
ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ను ముట్టడించేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాటర్ కానన్స్‌తో చెదరగొట్టారు.