ఇక్కడ బాంబు వేస్తే.. అక్కడ తగలబెట్టారు | cpm office set on fire in kozhikode | Sakshi
Sakshi News home page

ఇక్కడ బాంబు వేస్తే.. అక్కడ తగలబెట్టారు

Published Fri, Mar 3 2017 10:02 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

ఇక్కడ బాంబు వేస్తే.. అక్కడ తగలబెట్టారు - Sakshi

ఇక్కడ బాంబు వేస్తే.. అక్కడ తగలబెట్టారు

కోజికోడ్: కేరళలో అధికార సీపీఎం, ఆర్‌ఎస్ఎస్‌ల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపినవాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన తర్వాత హింసాత్మక చర్యలు చోటు చేసుకుంటున్నాయి.

చంద్రావత్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత గురువారం రాత్రి కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే కోజికోడ్‌లోనే సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు సీపీఎం కార్యాలయాన్ని తగలబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. పరస్పర దాడులతో కోజికోడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

సంబంధిత వార్తలు చదవండి
 

సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement