అద్వానీని ఒప్పించలేకపోయిన రాజ్నాథ్
న్యూఢిల్లీ : పార్టీ అగ్రనేత అద్వానీ ఆమోదం లేకుండానే బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించనున్నారా? తాజా పరిణామాలు, బీజేపీలో కొనసాగుతున్న తర్జనభర్జనలు అవుననే సమాధానమిస్తున్నాయి. మోడీని ఇప్పుడిప్పుడే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవద్దని అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలు గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ నిర్ణయం వెలువడి తీరుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సహా కొందరు పార్టీ నేతలు మోడీ విషయంలో పట్టుదలతో ఉండడంతో అద్వానీ ఒప్పుకోకపోయినా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 13న ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఒక్కొక్కరినే ఢిల్లీకి రప్పిస్తున్నారు.
ఈ సమావేశంలోనే మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత అదే రోజు లేదా ఈ నెల 19న మోడీని బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అటు రాజ్‌నాధ్‌సింగ్ ఇవాళ మరోసారి సుష్మా స్వరాజ్‌తో సమావేశం కానున్నారు. మరోవైపు.... పార్టీలో అద్వానీ శకం ముగిసిపోయిందని బీజేపీ బీహార్ శాఖ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యానించారు.