ఫేస్‌బుక్ చేతికి లిటిల్ ఐ ల్యాబ్స్ | Facebook acquires Bangalore based Little Eye Labs | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ చేతికి లిటిల్ ఐ ల్యాబ్స్

Published Thu, Jan 9 2014 1:31 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

ఫేస్‌బుక్ చేతికి లిటిల్ ఐ ల్యాబ్స్ - Sakshi

ఫేస్‌బుక్ చేతికి లిటిల్ ఐ ల్యాబ్స్

 న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ఫేస్‌బుక్ బెంగుళూరుకు చెందిన లిటిల్ ఐ ల్యాబ్స్ కంపెనీని కొనుగోలు చేసింది.  ఫేస్‌బుక్ కంపెనీకి ఇది భారత్‌లో తొలి టేకోవర్. అయితే ఎంత మొత్తానికి దీనిని కొనుగోలు చేసింది వెల్లడి కాలేదు. అయితే ఈ డీల్ విలువ కోటి-కోటిన్నర డాలర్ల వరకూ ఉండొచ్చని సమాచారం. ఆండ్రాయిడ్ ఓఎస్ సంబంధిత మొబైల్ యాప్ డెవలపర్ల కోసం మానిటరింగ్ టూల్స్‌ను, పెర్ఫామెన్స్ ఎనాలసిస్ సంబంధిత కార్యకలాపాలను ఈ లిటిల్ ఐ ల్యాబ్స్ నిర్వహిస్తుంది. ఫేస్‌బుక్ టేకోవర్ కారణంగా తమ మొబైల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు మరో స్థాయికి పెరుగుతాయని లిటిల్ ఐ పేర్కొంది.  

ఈ కంపెనీ టేకోవర్ వల్ల మరింత సమర్థవంతమైన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ఆవిష్కరణ సాధ్యమవుతుందని ఫేస్‌బుక్ ఇంజినీరింగ్ మేనేజర్ సుబ్బు సుబ్రమణ్యన్ చెప్పారు. ఏడాది క్రితం గిరిధర్ మూర్తి, కుమార్ రంగరాజన్, సత్యం కందుల, లక్ష్మణ్ కాక్కిరాల-ఈ నలుగురు లిటిల్ ఐ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టేకోవర్ కారణంగా ఈ కంపెనీ సిబ్బంది మొత్తం ఫేస్‌బుక్ కేంద్ర కార్యాలయం, మెన్లోపార్క్(కాలిఫోర్నియా)కు తరలివెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement