హైదరాబాద్‌లోనూ ‘దిగగానే వీసా’ | Foreiegn tourist get immediate visa in hyderbad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనూ ‘దిగగానే వీసా’

Published Thu, Aug 29 2013 4:34 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

Foreiegn tourist get immediate visa in hyderbad

న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులు మన దేశంలో ‘దిగిన తర్వాత వీసా (వీసా ఆన్ అరైవల్)’ తీసుకునే అవకాశాన్ని హైదరాబాద్‌లోనూ కల్పించారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం ఈ ‘వచ్చాకే వీసా’ విధానాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని ప్రకారం విదేశీయులు ముందుగా వీసా తీసుకోకుండానే మనదేశానికి వచ్చేయొచ్చు. వారు దిగిన విమానాశ్రయాల్లోనే వీసా తీసుకునే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఈ సౌకర్యం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాల్లోనే ఉండగా.. తాజాగా హైదరాబాద్, తిరువనంతపురం, బెంగళూరు, కొచ్చిలకు విస్తరించా రు. అయితే..ప్రస్తుతం జపాన్, సింగపూర్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, కాంబోడియా, లావోస్, వియత్నాం, ఫిలిప్పైన్స్, మయన్మార్, ఇండోనేసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాత్రమే ఈ ‘వచ్చాకే వీసా’ సౌకర్యం పొందే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement