
భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
దేశీయ బంగారం దిగుమతులు గణనీయంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో సుమారు 76 శాతం దిగుమతులు ఎంఎంటిసి - పీఏఎంపీ వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశీయ బంగారం దిగుమతులు గణనీయంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో సుమారు 76శాతం దిగుమతులు తగ్గాయని భారతదేశ అసమాన జాతీయ పంపిణీ నెట్ వర్క్ (ఎంఎంటిసి - పీఏఎంపీ) వెల్లడించింది. ఈ క్వార్టర్ లో 60 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు బంగారం, వెండి, రిఫైనరీ ఎంఎంటీసీ-ప్యాంప్ తెలిపింది. అధిక ఎగుమతి సుంకాలు, ఇతర పన్నుల ప్రభావం బంగారం, వెండి దిగుమతులపై పడిందని వివరించింది. గత ఏడాది 250 టన్నులతో పోలిస్తే ఇది భారీ క్షీణత అని తెలిపింది.
అయితే అనధికారికమార్గాలో దాదాపు 80 టన్నుల బంగారం దేశంలోకి వచ్చినట్టు పేర్కొంది. 10 శాతం దిగుమతి సుంకం కారణంగా ఈ పరిణామమని చెప్పింది. అలాగే ఈ నాలుగు నెలల్లో అనధికారిక మార్గాల ద్వారా బంగారం 80 టన్నుల దిగుమతి కావడాన్ని గమనించాలన్నారు. దీన్ని 3-4 శాతం తగ్గించకపోతే ఈ ధోరణి మరింత పెరిగే ప్రమాదముందని ఎంఎంటీసీ ఎండీ రాజేశ్ ఖోస్లా తెలిపారు. తమ సంస్థ దిగుమతులు కూడా గత ఏడాదితో పోలిస్తే 5 టన్నుల పడిపోయిందని నివేదించింది.
ప్రపంచంలో బంగారంలో వినియోగంలో చైనా తర్వాత భారత్ నిలుస్తుంది. 2015-16 సం.రంలో 650 టన్నుల బంగారం దిగుమతితో రెండవ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. కాగా ఈ ఏడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో డాలర్ స్ట్రాంగ్ కావడంతో గ్లోబల్ మార్కెట్లో క్షీణించిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం నష్టాల్లో నీరసంగా కదలాడిన పుత్తడి ధరలు శుక్రవారం బాగా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్‌లో పది గ్రా. ల బంగారం ధర 133 రూపాయల లాభంతో 31,460 వద్ద ఉంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు నష్టపోయింది.