11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్ | KCR to meet sonia gandhi today | Sakshi
Sakshi News home page

11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్

Published Sat, Feb 22 2014 10:23 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్ - Sakshi

11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్

న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో విలీనంపై కేసీఆర్ ఎటుతేల్చుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక విలీనమా ? పొత్తా ? అనే దానిపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విలీనం అయితే కొందరు ముఖ్యులకు తప్ప..మిగితా వారికి తగిన ప్రాదాన్యం ఉండక పోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  విలీనమా ? పొత్తా ? అనే  అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి. ఈ అంశంపై  స్పష్టత కోసం పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు. సోనియాతో భేటీ అనంతరం కేసీఆర్ దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement