
అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..: కోహ్లి
పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు లభించలేదు
లండన్: పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. జట్టుకు వెన్నెముకగా ఉన్న అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించారు. తుదిజట్టులో స్థానం దక్కకపోవడాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పు సమీకరణాలను అశ్విన్ అర్థం చేసుకోగలడని కోహ్లి మీడియాతో పేర్కొన్నాడు. టాప్ బౌలర్‌ను పక్కనబెట్టాల్సిన రావడం కష్టమే కదా అని మీడియా ప్రశ్నించగా.. అబ్బే అది చాలా సులువు అంటూ కోహ్లి స్పందించాడు.
‘అశ్విన్ టాప్ క్లాస్ బౌలర్. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వుం ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది’ అని కోహ్లి వివరించాడు.
అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కోహ్లి అంగీకరించాడు. అయితే, ఇవి మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే కానీ, జట్టు సెలెక‌్షన్ విషయంలో ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని చెప్పాడు. ‘ఔను, మా మధ్య బౌలింగ్ ప్లాన్స్, ఇతరత్రా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. సొంత ప్లాన్స్‌తో మైదానంలోకి అడుగుపెడతాడు. అందువల్ల ఇలాంటి విభేదాలు వస్తుంటాయి’ అని వివరించాడు.