ముంబై: చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ2 నికర లాభాల్లో 44.6 శాతం వృద్ధితో రూ..64.85 కోట్లను నమోదు చేసింది. మొత్తం ఆదాయం19 శాతం ఎగిసి రూ. 830.30 కోట్లు, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 70 శాతం పెరిగి రూ.158.42 కోట్లకు సాధించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి ముఖర్జీ ప్రకటించారు. స్లిప్ పేజెస్ ఫలితంగా స్థూల నిరర్థక ఆస్తులు సెప్టెంబర్ 30, 2016 నాటికి 2.70 శాతం దగ్గర నమోదైనట్టు తెలిపారు.
గత సెప్టెంబర్ తో పోలిస్తే ప్రస్తుత ఖాతా పొదుపు ఖాతా నిష్పత్తి17.31 శాతం వరకు వృద్ధిచెందింది. బ్యాంకు మొత్తం డిపాజిట్లు 13.8 శాతం రూ.26,680 కోట్లుగా ఉన్నట్టు రిపోర్టు చేసింది. క్రెడిట్ పోర్ట్ఫోలియో రూ. 17,573.80 కోట్లనుంచి మెరుగుపడి రూ. 20,253 కోట్లకు మెరుగుపడింది.