హైదరాబాద్: మలేసియా తెలుగు సంఘం (తామ్) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆగస్టు 31న కౌలాలంపూర్‌లోని బ్రిక్ ఫీల్డ్‌లో ‘దాటు భజన’ పేరిట ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఏకధాటిగా 12 గంటలపాటు ప్రదర్శన నిర్వహించింది.
ఈ ప్రదర్శనను మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు అరుదైన రికార్డుగా గుర్తిస్తూ తమ పుస్తకంలో చోటు కల్పించారు. తామ్ అధ్యక్షుడు డాటో డాక్టర్ అచ్చయ్య కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.
మలేసియా రికార్డ్స్‌లోకి ‘దాటు భజన’
Published Wed, Sep 3 2014 4:50 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement