భారీ స్థాయిలో ఓటింగ్.. ప్రజల అమితాసక్తి
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 69 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటలకే 43 శాతం ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశముంది. ఈ రోజు తొలి దశలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్ ఉక్కుమహిళ, పీఆర్‌జేఏ అధ్యక్షురాలు ఇరోమ్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్‌తో పోలిస్తే యూపీలో తక్కువ ఓటింగ్ నమోదవుతోంది. ఒంటి గంట సమయానికి 37.85 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో దశలో ముగుస్తాయి. మార్చి 11న ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.